Popular Posts

Orgtelugu. Powered by Blogger.

couch mode print story

OTG cable యెక్క ఆసక్తికరమయిన ఉపయోగాలు

మనం సాదారణంగా OTG Cable ను pendrive connect చేయడానికి ఉపయోగిస్తాం.కాని దాని ద్వారా చేయగలిగే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

1)పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్ కనెక్టు చేయడం.(connect to a pendrive or external hardisk.)

ఇది అందరికి తెలిసిన విషయమే OTG cable ఉపయోగించి పెన్ డ్రైవ్ లోని సమాచారాన్ని phone లో చూడవచ్చు.అంతేకాకుండా computer యెక్క ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ కూడా కనెక్టు చేయవచ్చు.దీని ద్వారా phone మెమోరి అధికంగా పెంచి వాడుకొనవచ్చు.

2)కంప్యూటర్ కీ బోర్డ్ కనెక్టు చెయడం.(connect to a computer USB keyboard)

Phone లోని on screen కీ బోర్డ్ తో చాటింగ్ చేయడం బోర్ కొట్టే విషయం.OTG cable ను ఉపయెగించడం ద్వారా ఈ సమస్య ఉండదు.USB keyboard ని ఉపయోగించి OTG ద్వారా phone కి కనెక్టు చేసి వాడుకోవచ్చు.

3)మౌస్ కి కనెక్ట్ చేయడం(Connect to a USB mouse)

OTG ద్వారా మౌస్ ని phone కి కనెక్టు చేసి వాడుకోవచ్చు.phone touch పని చేయనప్పుడు ఇది ఉపయెగంగా ఉంటుంది.

4)కెమెరాకు కనెక్టు చేయడం.(connect to a camera)

ఇది ఫోటోగ్రాఫర్లకు ఉపయేగకరం లాబ్ టాప్ అందుబాటులో లేనప్పుడు తీసిన ఫోటోలు కెమెరాలో సరిచూసుకోవచ్చు.

5)ఫోన్ చార్జ్ చేయడానికి(charge your another phone)

OTG cable ఉపయోగించి ఇంకొక phone ని చార్జింగ్ చేయవచ్చు.

6)గేమ్ కంట్రోలర్ కనెక్టు చేయడం.(connect to game controller)

Mobile గేమ్స్ ఆడడానికి గేమ్ కంట్రోలర్ OTG ద్వారా కనెక్టు చేసి వాడుకోవచ్చు.

7)USB ఫ్యాన్ కి కనెక్టు చేయడం(connect to a USB fan)

లేటెస్టు గా వచ్చిన (mi) USB ఫ్యాన్ ఉపయోగించి  ఫోన్ కి ఫ్యాన్ కనెక్టు చేయవచ్చు.

8)LAN కేబుల్ కి కనెక్టు చేయడం.(connect to LAN cable)

Wifi మరియు మొబైల్ టాటా లేకపోయినా LAN cable connect చేయడం ద్వారా ఫోన్లో ఇంటర్నెట్ ఉపయేగించవచ్చు.

9)USB లైట్ కి కనెక్టు చేయడం.(connect to USB light)

USB లైట్ ను OTG ద్వారా mobile కి కనెక్టు చేసి వాడుకోవచ్చు.